కుండలి పరిశీలన అనేది ఒకరి భవిష్య త్తును అంచనా వేయడానికి మరియు జీవిత సంఘటనలను కనుగొనడానికి ఒక సనాతన భారతీయ ఆచారం. ఇది ఒక వ్యక్తి యొక్క జన్మ వివరాలు, గ్రహాల స్థానాలు మరియు జ్యో తిషశాస్త్ర అంశాల యొక్క సమీకరణ . జన్మ కుండలి లో వృత్తి, అభివృద్ధి, ఆరోగ్యం, వివాహం, ప్రేమ, కెరీర్, కుటుంబం మరియు సంబంధాలు వంటి వివిధ అంశాల పై సమగ్ర అవగాహనను అందిస్తుంది.
జాతక చక్రం లో పరిశీలంచబడే పాయింట్లు:
1. జాతకాన్ని తెలుసుకోవడానికి, ఒక వ్యక్తి ఖచ్చితమైన పుట్టిన ప్రదేశం, పుట్టిన సమయం మరియు పుట్టిన తేదీ వివరాలను కలిగి ఉండాలి.
2. వైదిక జ్యోతిషశాస్త్ర౦ ప్రకారం లగ్న కుండలి (జన్మ చార్ట్), నవాంశ కుండలి (D-9 చార్ట్), ఇతర వివిధ అంశాలు , దశ, అష్టక వర్గ ద్వా రా ఫలితాలు చెప్పబడును.
3. ఒకరి స్వ భావం, ప్రవర్తన, విద్య, , ఆరోగ్యం, వృత్తి, ప్రేమ, వివాహం, పిల్లలు మొదలైన వాటిపై విశ్లేషణ ఇవ్వబడును.
4. సమస్యలకు పరిష్కారాలము సూచించబడును.
5. ధారణకు యోగ్యమైన రత్నములను సూచించబడును.